Saturday, March 20, 2010

మరో మాస పత్రిక


ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ గుడిపాటి సంపాదకత్వంలో కొత్తగా ఓ మాస పత్రిక వెలువడుతోంది. ఈ మధ్య కాలంలో ప్రచురణ రంగంలోకి ప్రవేశించిన గుడిపాటి గారు, పాలపిట్ట అనే పేరుతో ఓ సమగ్రమైన సాహితీ పత్రికని మన ముందుకు తెస్తున్నారు. కవితలు, కథలు, సమీక్షలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు, ఇంకా ఇన్నెన్నో విశేషాలతో మార్చి నెల సంచిక విడుదలైంది. 108 పేజీలున్న ఈ సంచిక వెల 30 రూపాయలే. ప్రతులకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించండి.
ఎడిటర్, పాలపిట్ట మాసపత్రిక
16-11-20/6/1/1,
403, విజయ సాయి రెసిడెన్సీ, సలీం నగర్,
మలక్ పేట్, హైదరాబాద్-500036.
ఫోను-9848787284.

Friday, March 19, 2010

నా వెబ్ సైట్ గురించి

తెలుగు అనువాదం అనే పేరుతో ఉన్న నా వెబ్ సైట్ రూపురేఖలను మార్చాను. ఇదివరకటి మూస అంత ఆకర్షణీయంగా లేదని చాలా మంది మిత్రులు చెప్పడంతో, అలాగే నాకిష్టమైన చిలకపచ్చ రంగు టెంప్లేట్ దొరకడంతో నా సైట్‌ని మార్చాను. ఇది కూడా సింపుల్ డిజైనే. చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.