వైష్ణవి ఏం తప్పు చెసింది? తండ్రి మీద పగతో....అదీ ఆస్తి తగాదాలతో, ఓ పసి పాపని దారుణంగా హత్య చేయడం మనసుని తొలిచేసింది.
వైష్ణవిని కిడ్నాప్ చేసి, హతమార్చి, పెట్రోల్‌పోసి తగులబెట్టి అనంతరం మృతదేహం ఆనవాలులేకుండా చేయడం పైశాచికత్వానికి పరాకాష్ట. ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన ముద్దుల కూతురు మరణించిందని తెలుసుకున్న తండ్రి ప్రభాకర్ గుండెపోటుతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
ఈ ఘటన మానవత్వానికే మచ్చ. ఈ చర్యని ఎండగట్టడానికి పశుత్వం అనే మాట సరిపోదు, సరికాదు, అవసరమైతే ఏదైన కొత్త పదాన్ని సృష్టించైనా వాడాలి. మనుషులుగా మన ప్రస్థానం ఎటు?
3 comments:
చనిపోయింది ధనవంతుడి కూతురు కాబట్టి మీడియావాళ్ళు ఇంత ఏడుస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో పేదవాడి కూతురు వైద్యం అందక చస్తే ఇలా ఏడుస్తారా?
చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.
http://epaper.sakshi.com/Details.aspx?id=373788&boxid=28596068
Post a Comment