Saturday, December 27, 2008

కథకి వోటు

అందరికీ నమస్కారం!


2008 లో నేను 4 సొంత కథలు రాసాను, 13 కథలు అనువదించాను. వేరే భాషల నుంచి తెలుగు లోకి 11, తెలుగు నుంచి హిందీలోకి 2. నావి రెండు సొంత కథలకు (నా మొహం, అందలాలు - అగాధాలు) మంచి స్పందన వచ్చింది. 25 డిసెంబర్ 2008 నాడు పుస్తక ప్రదర్శనకి వెడితే అక్కడున్న బ్లాగ్‌మిత్రులు నా మొహం కథని ప్రస్తావించారు. బ్లాగులో కాకుండా నేరుగా వాళ్ళ అభిప్రాయం తెలుసుకోగలినందుకు సంతోషమేసింది.


ఇక అనువాదల విషయానికి వస్తే, తెలుగులోకి అనువదించిన కథలలో నాకు బాగా నచ్చిన కథకి బ్లాగర్లనంచి పెద్దగా స్పందన రాలేదు. అందుకని, చిన్న అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. 2008లో నేను అనువదించిన కథలలో మీకు నచ్చిన కథకి ఓటేయ్యండి. ఈ కథలన్నీ, నా బ్లాగు లో ఉన్నాయి (ఒక్క సెన్సిటివిటి ట్రైనింగ్ తప్ప, దాన్ని ఈ-మాట వారి సైట్‌లో చదవచ్చు). మీరి కథలన్నీ చదివి ఉంటారని అనుకుంటున్నాను.


కాస్త వీలు చేసుకుని, పక్కనున్న Pollలో మీ వోటు నమోదు చేయండి.


ధన్యవాదాలు.

0 comments: