Thursday, September 6, 2007

ఆ ఇరవై నిమిషాలు...

మా పాప పేరు శుభద. ఏడాదిన్నర వయసు. ఇప్పుడిప్పుడే మాటలు స్పష్టంగా పలకడం, రెండు మూడు పదాలతో వాక్యంలా చెప్పడం వస్తున్నాయి. అదే సమయంలో అల్లరి కూడా నేర్చుకుంటోది. నిన్న మధ్యహ్నం ఓ ఇరవై నిమిషాల పాటు మమ్మల్ని ఎంతో కంగారు పెట్టేసింది. మేము మొదటి అంతస్తులో ఉంటాము. మా ఇంటి హాల్ కి రెందు వైపుల తలుపులు ఉన్నాయి. దోమల బాధ నుంచి తప్పించుకోడానికి, సాధారణంగా side door, కిటికి మూసేసి ఉంచుతాం. నిన్న నా భార్య భాను బట్టలు ఆరేయడానికి సందులోకి వెడుతూ, పాపాయి కోసం తెలుగు rhymes సిడి ఆన్ చేసి వెళ్ళింది. పాప "చిట్టి చిలకమ్మా, అమ్మ కొత్తిందా." అంటూ లోపలినుంచి తలుపు గడియ వేసేసింది. సందులో పని పూర్తిచేసుకుని, భాను లోపలి వద్దామని చూస్తే ఏముంది, తలుపు వేసేసి ఉంది. ఇంక అప్పటినుంచి, ఎన్ని సార్లు పిలిచినా, అరిచినా, మా పాపాయి వినిపించుకోలేదు. టివి వదిలేసి bedroom లోకి వెళ్ళిపోయిందట. భాను కేకలకి మా పక్కింటాయన నిద్ర లేచారు (ఆయన ఓ కాల్ సెంటర్ లో night shift పనిచేస్తారు)బయటకి వచ్చి విషయం తెలుసుకున్నారు. ఆయానా చాలా సార్లు పిలిచి చూసారు. చివరికి owners కి చెప్పి తలుపు గదియ దగ్గర పగలుగొట్టలని నిర్ణయించుకున్నరు. మళ్ళీ భయం, ఆ సమయంలో పాప తలుపు వెనకాలే ఉంటే దెబ్బ తగులుతుందేమోనని. ఇంతలో, భాను కి ఉపాయం తట్టి కాలింగ్ బెల్ కొట్టింది. అంటే, మా పాపాయి "నాన్నా వచ్చి" అంటూ తలుపు తీసిందట. అమ్మాయ్యా అనుకుంటూ అందరు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఇంటికి వెళ్ళాక, భాను ఇదంతా చెబుతుంటే, ఆమె అజాగ్రత్తకి మందలించాలో, లేదా సమయస్పూర్తి చూపి, బెల్ కొట్టినందుకు మెచ్చుకోవాలో నాకర్థం కాలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా బెల్ కొడితే తలుపు తీయాలనే ఆలోచన వచ్చినందుకు నా కూతురుని గట్టిగా ముద్దెట్టెసుకున్నాను.

0 comments: