ఉపయోగించకపోతే
కత్తి తుప్పు పడుతుంది!
వినియోగించకపోతే
మేధ తప్పుల పడుతుంది!!
గమనం ఉంటేనే కద -
గమ్యం అందేది!
పఠనం చేస్తేనే కద -
ప్రతిభను పొందేది!!
వట్టిగా ఉంటే
మట్టిలో చెదవవుతావు!
గట్టి కృషి ఉంటే
చేవ గల ప్రగతివవుతావు!!
- మరికంటి (తెలుగు విద్యార్ధి మార్చ్ 1996)

0 comments:
Post a Comment