Saturday, July 21, 2007
అడవి పిలిచింది
జాక్ లండన్ రాసిన call of the wild పుస్తకానికి ఎ. గాంధీ గారి సంక్షిప్తానువాదమిది. పీకాక్ క్లాసిక్స్ వారి ప్రచురణ. విశాలాంధ్ర వారి అన్ని శాఖలలోను లభ్యం.ఉత్తర ధృవ ప్రాంతాలలో బంగారు గనులు బయటపడినప్పుడు వాటిని సొంతం చేసుకోడానికి మనుషులు వేలాదిగా అక్కడికి వెళ్ళారు. ఆ మంచు ప్రాంతాలలో వాళ్ళ సరుకులను లాగాడానికి బలమైన కుక్కలు కావల్సి వచ్చాయి. బక్ శాంతకార్లాలోని లోయలో ఉన్న విశాలమైన భవంతి లో ఉండే కుక్క. యజమాని లేనప్పుడు, ఓ నౌకరు దాని అమ్మేస్తాడు. నాగరిక జీవితం లోంచి ఆటవిక జీవితం లోకి ప్రవేసించిన బక్ లో ఎన్నో మార్పులొస్తాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటుంది. 'జీవిత సత్యాలు ' పూర్వం కన్న క్రూరంగా ప్రత్యక్షమవుతాయి. ఈ చిన్న పుస్తకంలోని కొన్ని అద్భుతమైన వాక్యాలు: 1. దయా దాక్షిణ్య రహితమైన జీవిత పోరాటానికి నీతి ఓ పెద్ద ప్రతిబంధకం. 2. జీవితపు అత్యున్నత స్థాయినందుకుని మళ్ళీ అలాంటి దశ జీవితంలో రాదన్నప్పుడు ఒక గొప్ప ఆవేశం కలుగుతుంది. జీవితపు ఉచ్ఛ దశలో అనుభవమయ్యే ఈ ఆవేశం అదేం చిత్రమో జీవితాన్ని విస్మరింపజేస్తుంది. తాను జీవించి ఉన్నట్లు కూడా తెలియనివ్వని ఈ ఆవేశం కళాకారుడికి అనుభవమైనప్ప్పుడు ఒక మహా జ్వాలతో పైకి లేస్తాడు.3. అధికారం చెయ్యాలి. లేదా అణగిపడి ఉండాలి. జాలి చూపడం దుర్బలత్వం. ఆటవిక జీవితం లో దయ అనేది లేదు. చంపు లేద చావు. చేతనైతే తిను. లేదా ఇతరులకు ఆహారం అయిపో.పాఠకుడు ఊపిరి సలుపుకోడానికి వీలులేనంత వేగంతో కధ సాగే ఈ పుస్తకం చదవదగ్గది.
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment